ఆ బంధానికి ఐఎస్ఐ సర్టిఫికెట్ ఉంది. ఆ ఇద్దరి బంధం సక్రమమైనదే. అలా చేస్తే తప్పేమీ కాదు. ఆ ఇద్దరి మధ్యా ఉన్నది ధృఢానుబంధం... ప్రేమైక బంధం అని అంగీకరిస్తున్నారు. అది కూడా కపూర్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలంతా అతడి బంధాన్ని ఓకే చేశారు. ఒకే ఒక్క చెల్లెలు డాడ్ తప్ప అర్జున్ కి ఇంకెవరూ అడ్డు చెప్పడం లేదు. సోనమ్ కపూర్ అనీల్ కపూర్ టోటల్ కపూర్ ఫ్యామిలీకి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇక మలైకా అరోరాఖాన్ గ్యాంగ్ లో ఉన్న హాట్ గాళ్స్ ఎవరూ అసలే అడ్డు చెప్పడం లేదు. మలైకా సోదరి అమృత అరోరాఖాన్ కరిష్మా కపూర్ గౌరీ ఖాన్ .. వీళ్లందరికీ ఆ ఇద్దరి చెలిమి అంగీకారమే. ఆ ఇద్దరూ పెళ్లాడుకుంటే తప్పేం లేదన్న సిగ్నల్స్ ఓపెన్ గానే ఇచ్చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు రచ్చ చేసే ఏ పార్టీలోకి అయినా అతగాడికి ఇన్విటేషన్ తప్పనిసరి. గ్యాంగ్ అంతా కలిసి రచ్చ రచ్చ చేస్తారు. సిటీలో రెస్టారెంట్లు పబ్బు క్లబ్బు అనే తేడా లేకుండా ఒకటే రచ్చ గ్యారెంటీ.
లేటెస్టుగా ఈ గుంపు అంతా జుహూ లోని ఓ పాపులర్ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ చేసిన రచ్చను ఫోటోగ్రాఫర్లు క్యాచ్ చేశారు. ఆ గుంపులో ఆ జంట ఒకరినొకరు విడిచిపెట్టకుండా తచ్చాడే సన్నివేశాన్ని క్యాప్చుర్ చేసేశారు. చేతిలో చెయ్యేసి చెప్పు రాజా.. అన్న తీరుగా ఆ జోడీ పార్టీ చేసుకోవడం కంట పడింది. మలైకా- అర్జున్ జోడీ ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్యాచ్ చేసి ప్రస్తుతం వెబ్ లో వైరల్ చేస్తున్నారు ఆ ఫోటోల్ని. యువతరం అంతే క్రేజీగా ఆ ఇద్దరి యాక్టివిటీస్ ని క్యాచ్ చేస్తున్నారు.
@arjunk26 with #MalaikaArora snapped now post dinner at sohohouse in Juhu. #Arjunkapoor #malaikaarora pic.twitter.com/U4DKb4nKZn
— ArjunKapoor Universe (@ArjunK_Universe) February 6, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa