ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘యాత్ర’ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 12:53 PM

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు  రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది..?


కథ‌ : ఇది ఈవెంట్ బేస్డ్‌ బయోపిక్‌. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్‌ఆర్‌కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్‌ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్‌ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ.


న‌టీన‌టులు : బయోపిక్‌ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖర్‌రెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నమంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖర్ రెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్‌ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు.


విశ్లేషణ : ముఖ్యంగా ‘యాత్ర’ సినిమాకు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి..పాదయాత్రతో ఎలా ముఖ్యమంత్రి కావడం..ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాడనే కాన్సెప్టే ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమాలో వైయస్ పాత్రను మమ్ముట్టి ఒదిగిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్‌గా ఆయన నైజాన్ని చూపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు ఎవరు సీఎం అయిన పర్వాలేదు కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాకుడదు. అలా సొంత పార్టీలో విపక్షాన్ని ఎదుర్కొని ఎలా మహానాయకుడుగా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచినందకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతులపై అప్పటి బాబు గవర్నమెంట్ బషీర్‌బాగ్‌లో కాల్పులు జరపించిండం ఈ సినిమాకు హైలెట్. ముఖ్యంగా పాదయాత్ర నేపథ్యంలో కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం..ఈ కోవలోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన వైయస్ఆర్‌కు రావడం వంటివి చూపించారు. మరోవైపు ఆరోగ్యం కోపం ప్రజల కష్టాలకు చలించపోయి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలు, డబ్బులు కట్టలేక పెద్ద చదువులు చదవలేకపోయిన  వారికోసం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశం పెట్టడంతో చిన్న, మధ్యతరగతి ప్రజలకు పెద్ద చదువులను దగ్గరచేయడం వంటివి చాలా ఎమోషనల్‌ సీన్స్  ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. స్టోరీ, కంటెంట్  పరంగా బాగున్నా...ఈ సినిమా నేరేషన్ మాత్రం చాలా స్లాగా సాగడం మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా క్లైమాక్స్‌లో వైయస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విజువల్స్‌ను నిజంగానే చూపించి ప్రేక్షకులను ఎమోషన్ గురిచేసారు.


మూవీ రివ్యూ : 3.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa