జియా ఖాన్ మృతి కేసులో ముంబై CBI కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ కారణంగా జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు సంబంధించిన తగిన సాక్ష్యాలు లేనందున అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు CBI కోర్టు న్యాయమూర్తి AS సయ్యద్ పేర్కొన్నారు. ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.