టాలీవుడ్ హీరో రవితేజ నటించిన చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాగా, థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మొదట ఈ మూవీ మే మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. కానీ తాజాగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.