ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ 118 నుంచి చందమామే సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 07:11 PM

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `118`. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు . ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 1 న విడుదల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలోని చంద‌మామే సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ అంజనేయులు రాసిన ఈ గీతాన్ని యాజిన్ నిజార్ ఆలపించారు.శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చాడు.


నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: వ‌ంశీ కాక‌, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేశ్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa