సాయిపల్లవి.. డాన్సర్‌గా ప్రస్థానం మొదలు పెట్టి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంలో మలర్‌గా కనిపించిన సాయిపల్లవి.. ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగులో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతో అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషాల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయిన ఈ అమ్మడు.. తాను పెళ్లి అసలే చేసుకోనని, కన్యగానే మిగిలిపోతానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పెళ్లి గురించి తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పేసింది. తాను పెళ్లి చేసుకోనని, జీవితాంతం కన్యగానే ఉండిపోతానని తేల్చిచెప్పింది. ‘ నా జీవితంలో పెళ్లి గిళ్లి జాన్తా నై. మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ జీవితాంతం ఇలాగే ఉండిపోతాను’ అని చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాయిపల్లవి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్స్, ఆమె అభిమానులు సమర్ధిస్తున్నారు. సినిమా అవకాశాల కోసం ఎన్నడూ హద్దుదాటని హీరోయిన్లలో సాయిపల్లివి ఒకరని, ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని, అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa