ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు. తాను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా కొత్త రంగుల ప్రపంచం ప్రమోషన్స్‌లో ఉండగా ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. తాను కోలుకుంటున్నానని పృథ్వీ చెప్పారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నానని తెలిపారు.