‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి చీరకట్టులో మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది. తొలిచిత్రంతోనే హిట్ ఖాతాను ఓపెన్ చేసింది. తన పెర్ఫామెన్స్ తో బేబమ్మగానూ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుర్రభామ అదరగొడుతోంది. ప్రస్తుతం ‘కస్టడీ’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కు జోడీగా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మే 12 గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. కృతి శెట్టి కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలోనూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో చీరకట్టులో మెరిసింది.మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లోనూ కృతి శెట్టి గ్లామర్ మెరుపులు మెరిపించడంతో మైమరిచిపోతున్నారు. బేబమ్మ అందాలకు ఫిదా అవుతున్నారు.
![]() |
![]() |