పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజి’ సినిమాపై ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో గురువారం నుంచి మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోహీరోయిన్‌లతో పాటు ప్రధాన తారాగణంపై నేటి నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తారట.