వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 24, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
![]() |
![]() |