మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో IMAX, EPIQ మరియు 4DX ఫార్మాట్లలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ చిత్రం పొన్నియిన్ సెల్వన్-2 థియేటర్లలో 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం మే 26, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి రెంటల్ బేస్ పై అందుబాటులోకి రానుంది అని సమాచారం. అయితే ఈ విషయం గురించి OTT ప్లాట్‌ఫారమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలు పోషించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.