ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరవై ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి

cinema |  Suryaa Desk  | Published : Thu, May 25, 2023, 10:16 PM

అరవై ఏళ్ల ఆశిష్ విద్యార్థి రూపాలి బారువాని ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. మొదటి భార్య రాజోషి బారువా. అలనాటి నటి శకుంతల కూతురు. రూపాలి కోల్‌కతాలో పెద్ద ఫ్యాషన్ స్టోర్ నడుపుతూ తన సొంత వ్యాపారంలో ఎదుగుతోంది. ఆమె స్వస్థలం గౌహతి. కొన్నేళ్లుగా ఉన్న పరిచయం ఈరోజు మూడు ముళ్ల దాకా తెచ్చింది. పెళ్లి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశిష్ విద్యార్థి పోకిరి, చిరుత, అలా మొదలైంది, అతిథి, అన్నవరం, గుడుంబా శంకర్,అదుర్స్  వంటి సినిమాల్లో నటించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com