మావెరిక్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన 'పొన్నియిన్ సెల్వన్-2' ఏప్రిల్ 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా రెంటల్ బేస్ పై ఈరోజు డిజిటల్ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ పీరియడ్ డ్రామాలో నాజర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, జయరామ్, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.