తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కె.వాసు శుక్రవారం మృతి చెందారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’కి దర్శకత్వం వహించారు. శ్రీషిరిడి సాయిబాబా మహత్యం, అమెరికా అల్లుడు, అల్లుళ్లొస్తున్నారు, ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.