టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల ఆగష్టు లేదా సెప్టెంబరుకు వాయిదా పడే అవకాశం ఉంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమా ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.