సమంత ఫిట్నెస్ ఫ్రీక్. కస్టపడి జీరో సైజ్ రాబట్టింది. ఈ స్టార్ లేడీ శరీరంలో ఓ పార్ట్ ని పెంచేందుకు తెగ కష్టపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది.అందంగా ఉన్నంతకాలమే హీరోయిన్స్ కి డిమాండ్. ఒకసారి షేప్ అవుట్ అయితే మేకర్స్ పట్టించుకోరు. ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తారు. అందుకే తారలు కష్టనష్టాల కోర్చి స్లిమ్ గా కనిపిస్తారు. అందుకు గంటల తరబడి వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఈ విషయంలో సమంత మరీ పర్టిక్యులర్. సమంత జీరో సైజ్ ప్యాక్ కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తారు.తాజాగా ఆమె ఓ వర్క్ అవుట్ వీడియో షేర్ చేశారు. అందులో ఆమె కాఫ్ మజిల్స్(కాలి పిక్కలు) పెంచేందుకు ఓ కఠిన ఎక్స్ర్సైజ్ చేశారు. ఆది కూడా వంద రిపీట్స్ అట. వందసార్లు పూర్తి కాగానే బాధతో అల్లాడిపోయింది. ఆ వీడియో వైరల్ గా మారింది. కాఫ్ మజిల్స్ షేప్, సైజ్ కోసం సమంత ఆ స్థాయిలో కష్టపడుతున్నారు.