సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు వారికి జరిగిన చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా తన చేదు అనుభవాన్ని వెల్లడించింది. సోనమ్ 13 ఏళ్ల వయసులో స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లానని తెలిపింది. ఇంటర్వెల్ టైమ్లో బయటకు వచ్చినప్పుడు ఓ వ్యక్తి అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి తనను గట్టిగా పట్టుకున్నాడట. తనపై చేతులు వేసి గట్టిగా నొక్కాడని చెప్పుకొచ్చింది.