పలు చిత్రాలతో తెలుగు బాక్సాఫీసు మోత మోగించిన పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల తాను స్టార్ నటిని కాదని ఇంకా చిన్నదనే అంటున్నారు. బుధవారం శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన గురించి ఆసక్తికరమైన విషయాలు. అగ్రహీరోల సరసన నటించేందుకు తనకు అవకాశం రావడం ఆనందంగా వుందని అన్నారు. అయితే తాను స్టార్ అనే మాట అనిపించుకోవడానికి తాను ఇంకా చిన్నదాన్నేనని చెప్పారు. ప్రేక్షకులు తనపై వుంచిన నమ్మకాన్ని నిరాశపర్చకుండా ఉండేందుకు నటనపై మరింత దృష్టి పెడతానని అన్నారు. హిందీ సినిమాల్లో అవకాశంపై కాలమే సమాధానం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.