బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. ఈ చిత్రం 16 జూన్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 120.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::
నైజాం : 50 కోట్లు
సీడెడ్ : 17.60 కోట్లు
ఉత్తరఆంధ్ర : 14.50 కోట్లు
ఈస్ట్ : 8.80 కోట్లు
వెస్ట్ : 7.20 కోట్లు
గుంటూరు: 8.60 కోట్లు
కృష్ణ: 8.50 కోట్లు
నెల్లూరు: 4.80 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 120.00 కోట్లు