ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు పెళ్లి చేసుకుని.. పిల్లలను కనాలని ఉంది.. కంగనా రనౌత్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 17, 2023, 12:15 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మనసులోని మాట చెప్పేసింది. చానాళ్ల తరువాత ఈ బ్యూటీ పెళ్లి గురించి మాట్లాడి ఫ్యాన్స్‎ను ఖుషీ చేసింది.నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న కంగనా ఇంకెన్నాళ్లు ఇలా ఒంటరి జీవితం అని అనుకుంది కాబోలు, మెడలో మూడు ముళ్లు వేయించుకుని తన కుటుంబంతో కొత్త లైఫ్‎ని ప్రారంభించాలని అనుకుంటోందట . ఈ విషయాన్ని కంగనాయే స్వయంగా తెలిపింది.


కంగనా వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది త్వరలో రిలీజ్ కాబోతున్న టీకూ వెడ్స్‌ షేరు సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కంగనా." ఎప్పుడు ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. తొందరపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లలను కనాలని ఉంది. ఈ బ్యాచిలర్ లైఫ్‎ని వీడి ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది. అదంతా ఎప్పుడు జరగాల్సి ఉంటే అప్పుడే జరుగుతుంది" అని కంగనా తెలపింది.


 


గతంలోనూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కంగనా. " ధాకడ్‌ సినిమాలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ నేను టామ్‌ బాయ్‌గా ఎందుకు ఉంటాను. నేను కొడతానని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని నాపై లేనిపోని పుకార్లు పుట్టిస్తే ఎలా? ఈ పుకార్లు విన్నవారు నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తారా? నాకు అసలు పెళ్లి అవుతుందా?"అంటూ చెప్పుకొచ్చింది.


 


కంగనా రనౌత్ ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ , అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలలో నటించిన టికు వెడ్స్ షేరు సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 23న ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com