మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. హీరో రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో మెగా స్టార్ చిరంజీవి ఇంట్లోకి కొత్త బిడ్డ అడుగుపెట్టనున్నాడు. ఈ మేరకు ఉపాసనకు జూన్ 20న డెలివరీ డేట్ ఇవ్వడంతో రేపు ఉదయం ప్రసవం కానున్న నేపథ్యంలో రామ్ చరణ్ దంపతులు ఇప్పటికే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నరు. అయితే రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నరు. అయితే పెళ్లయి దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండడంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.