ఇండియన్ 2 సినిమా ఘాటింగ్ ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతుంది. కాగా విమానాశ్రయంలో ఓ భారీ సీన్ చిత్రీకరిస్తుండగా ఎయిర్పోర్ట్ నిర్వాహాకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట. ఇక చిత్రబృందం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు, డిపార్చర్ ఏరియాలో షూటింగ్ చేసుకోవడానికి మాత్రమే పర్మీషన్ పొందింది. కానీ లావటరీ ఏరియాలో షూటింగ్‌కు పర్మీషన్ లభించలేదు. అయినా గానీ అక్కడ షూటింగ్ చేయడంతో ఎయిర్పోర్ట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. కాగా డిపార్చర్ ఎరియాలో పర్మీషన్ కోసం చిత్రబృందం ఏకంగా కోటి ఇరవైనాలుగు లక్షలు చెల్లించిందట.