ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి' చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు ఆహాలో జూన్ 23, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.
జయసుధ, శరత్‌బాబు. వనితా విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రమ్, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.