ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను ఈరోజు ఉదయం 11:34 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ట్రైలర్ ఇప్పుడు సాయంత్రం 06:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఆన్లైన్ ద్వారా వెల్లడించారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమతం, మకరంద్ దేశ్పాండే, జిషు సేన్ గుప్తా ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. శ్రీచరణ్ పాకాల, జూలియన్ అమరు ఎస్ట్రాడా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.