బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతుందని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భామ ‘సత్యప్రేమ్ కీ కథా’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. జైపూర్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరో కార్తీక్‌తో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కియారా బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపించింది. దాంతో నెటిజన్లు ఏదైనా శుభవార్త ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై కియారా ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.