సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులు అషు రెడ్డి, సురేఖా వాణి, జ్యోతిల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మరోసారి అషురెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కొన్ని మీడియా ఛానెళ్లు నా పేరు, ఫోన్ నంబర్‌ను వేస్తున్నారు. కేపీ చౌదరితో వందల కాల్స్ మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలతో రెండు రోజులుగా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను. తనను కించపరిచేలా కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తాను’ అని అషురెడ్డి హెచ్చరించారు.