‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న జెనీలియా.. పదేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మెరుస్తోంది.టాలీవుడ్ లో జెనీలియా కొన్నేళ్ల పాటు ఊపూపింది. వరుస చిత్రాలతో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. మళ్లీ సౌత్ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తోంది. అటు బాలీవుడ్ లో మాత్రం కెరీర్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది.జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరమే లేదు. ‘బాయ్స్’, ‘సత్యం’ చిత్రంతో ఆడియెన్స్ ను పలకరించింది.. ‘సాంబ, సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్, నా ఇష్టం’ వంటి సినిమాలతో అలరించింది. తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. తాజాగా జెనీలియా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. గోల్డ్ కలర్ చుడీదార్ లో మెరిసిపోయింది. జడలో ఓల్డ్ హీరోయిన్లలా పువ్వు పెట్టుకొని ఆకట్టుకుంది. ఒకప్పటి జెనీలియా లుక్ లో మెరిసింది. బ్యూటీఫుల్ స్మైల్, ఆకట్టుకునే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.