టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'గాందీవధారి అర్జున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్య కనిపించనుంది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగా, ఈ చిత్రం ఆగష్టు 25, 2023 న విడుదల కానుంది మరియు అదే విషయాన్ని ప్రకటించడానికి ఒక అద్భుతమైన పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు.
విమలా రామన్, నాజర్ మరియు వినయ్ రాయ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.