శోభిత ధూళిపాళ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. అచ్చ తెలుగు కుటుంబంలో జన్మించి నప్పటికీ.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలో బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ తర్వాత మేజర్ మూవీలో మెరిసిన ఈ భామ.. ఇటీవల `పొన్నియన్ సెల్వన్`తో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో సీక్రెట్ ఎఫైర్ నడుపుతుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పెళ్లి ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, చైతు వీటిపై ఇంతవరకు స్పందించలేదు. శోభిత సైతం నేరుగా రియాక్ట్ సందర్భాలు లేవు.
ఇదిలా ఉంటే.. తాజాగా శోభిత ట్విట్టర్లో `ఆస్క్ మి ఎనీథింగ్` సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరో రివీల్ చేసింది. శోభితకు ఇష్టమైన హీరో ఎవరా అని అనుకుంటున్నారా.. చైతు మాత్రం కాదండోయ్. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అంటే శోభితకు చచ్చేంత ఇష్టమట. చిన్నతనం నుంచి షారూక్ ఖాన్ ను ఆరాధిస్తున్నానని.. ఆయనతో కలిసి వర్క్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెబుతోంది. అంతేకాదు, షారూక్ ప్రస్తుతం చేస్తున్న `జవాన్` మూవీ కోసం సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నానంటోంది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.