ప్రముఖ నటుడు సోనూసూద్‌ను ఓ అభిమాని కోరిన కోరిక నెట్టింట వైరల్ అవుతోంది. ఆరవ్ కే చౌదరి అనే వ్యక్తి సోనూసూద్‌ను ఉద్దేశించి ఓ ట్విట్ చేశాడు. సోనూసూద్‌ను ట్యాగ్ చేసి ‘సెలానా గోమెజ్‌తో నా పెళ్లి జరిపించండి’ అని చెప్పాడు. దానికి సోనూసూద్ కూడా.. ‘నువ్వు ఇప్పుడు నన్ను యాక్టింగ్ మానించి మ్యారేజ్ బ్యూరో తెరిపించేలా ఉన్నావు’ అని చమత్కారంగా జవాబిచ్చాడు. వీరి సంభాషణ నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.