బోల్డ్ సీన్స్‌తో ఇటీవల మరింత డోస్ పెంచింది మిల్కీ బ్యూటీ తమన్నా. జీ కర్దా సిరీస్, లస్ట్ స్టోరీస్‌లో రెచ్చిపోయి బోల్డ్‌గా నటించింది. అయితే తనపై కామెంట్స్ చేసే వాళ్లకు తమన్నా కౌంటర్ ఇచ్చింది. ‘ప్రస్తుత జనరేషన్లో కూడా ఇలాంటి వ్యతిరేకత వస్తుందని నేను అనుకోలేదు. హీరోలు కూడా చాలామంది బోల్డ్ సీన్స్ చేస్తారు, కానీ వాళ్లని మాత్రం ప్రశ్నించరు. మేము చేస్తే మాత్రం విమర్శలు చేస్తారు’ అంటూ ఘాటుగా స్పందించింది.
ప్రస్తుత కాలంలో ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు నన్ను విమర్శించడం వింతగా అనిపిస్తుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ రోల్స్ చేస్తూనే ఉన్నా.. మొదట్లో డీ గ్లామర్ డే చేసి సడన్ గా అలాంటి ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టలేదు. ఓ నటి ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తే పర్సనల్ ఎటాక్ చేసి ఎందుకు ట్రోల్ అవుతారో అర్ధం కావట్లేదు.