బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. షూటింగ్ నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లిన షారుఖ్ అక్కడ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ దగ్గర అతడి ముక్కుకు గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావం ఏర్పడింది. దాంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రక్తస్రావం ఆపడానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం షారుఖ్ భారత్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.