ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు జనాదరణ పెరిగింది. దాంతో చాలా మంది స్టార్ హీరోలు ఓటీటీలోనే తమ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ చేస్తున్నారు. కోట్లల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఓటీటీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ అత్యధికంగా 125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ వెబ్‌సిరీస్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు వసూలు చేశాడట. అలాగే సైఫ్ అలీఖాన్ 15 కోట్లు, పంకజ్ త్రిపాఠి 10-12 కోట్లు, సల్మాన్ ఖాన్ 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.