మెగా కుటుంబంలో మరో జంట విడాకులకు సిద్ధమైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు కోరుతూ మంగళవారం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కాగా, 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగగా, కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.
నిహారిక, చైతన్య దంపతులకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. మే 19న వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా. తాజాగా వీరిద్దరికీ సుప్రీం ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరు చేసింది. 2020లో చైతన్యతో నిహారిక వివాహమవగా. మనస్పర్థల కారణంగా పెళ్లైన కొద్దికాలం నుంచే ఈ జంట దూరంగా ఉంటున్నారు.