నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరిచా
ప్రతి జన్మలోనా
నీతో ప్రేమలోనా
ఇలా ఉండిపోనా
ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావే
ఓ నచ్చావే నచ్చావులే
అనుకొని అనుకోగానే
సరాసరి ఎదురౌతావు
వేరే పనేం లేదా నీకు
నన్నే వదలవూ
నువ్వు నాకు ఎందుకింత
ఇష్టం అంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను
గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది
ఈరోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది
సీతకోక లాగా
నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరిచా
నీతో ఏదో చెప్పాలంటూ
పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే
ఆపేస్తున్నది ఓ
మనసునేమో దాచమన్న
అస్సలేమీ దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు
చూడకుంటే ఊసు పోదు
ఈ వైనం ఇంత కాలం
నా లోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం
భరించేదెలాగా
నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరిచా
ప్రతి జన్మలోనా
నీతో ప్రేమ లోనా
ఇలా ఉండిపోనా
ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావులే
ఓ నచ్చావే నచ్చావులే