తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేయాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే సినిమాల నుంచి కొన్నేళ్లు గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. 2024 ప్రథమార్థంలో సినిమాలన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారు. మళ్లీ 2027లోనే సినిమా చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.