మెగా డాటర్ నిహారికపై మంచు లక్ష్మి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారికపై పేరు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ‘నిజానికి నేను హాలీవుడ్ యాక్టర్‌ని. అన్ని వదిలేసి టాలీవుడ్‌కు వచ్చాను. కానీ టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లను ఆదరిస్తారు. తెలుగు వాళ్లని ఆదరించరు. తెలుగమ్మాయిలైన నిహారిక, బిందు మాధవి, శివాని, శివాత్మికకు ఏం తక్కువ. వాళ్లేందుకు హీరోయిన్లు కాలేకపోతున్నారు.’ అంటూ ఫైర్ అయ్యారు.