తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్సు రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలని సినీ నటుడు నరేశ్ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండటంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ పొందానని, దానికి మళ్లీ అనుమతి ఇవ్వాలని గతంలోనూ కోరగా ఇవ్వలేదని తెలిపారు. హిందూపురంలో నివాసం ఉంటున్నానని, రివాల్వర్ తన వద్ద ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన ఎస్పీని కోరారు.