సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించింది. ఈ స్టార్ లేడీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ సైమా వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఘనంగా జరగనుంది. సైమా ఈవెంట్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందు కోసం కోట్ అండ్ ప్యాంట్స్ ధరించిన మృణాల్ సూపర్ స్టైలిష్ పోజుల్లో అదరగొట్టారు. గత ఏడాది విడుదలైన సీతారామం మూవీతో మృణాల్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. వస్తూ వస్తూనే సంచలనానికి తెరలేపారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం భారీ విజయం సాధించింది. పెద్దగా అంచనాలు లేని ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. హిందీలో కూడా మెరుగైన వసూళ్లు రాబట్టింది.
#MrunalThakur pic.twitter.com/08O4LC3sIE
— VD bulletin (@vdbulletin) July 8, 2023