శ్రీని దర్శకత్వంలో కరుణాద చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఒక పాన్-ఇండియన్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఘోస్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఈరోజు నటుడి పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేసారు. ఈ దసరాకి ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి సిద్ధంగా ఉన్నట్లు కూడా మూవీ మేకర్స్ ప్రకటించారు. యాక్షన్-ప్యాక్డ్ హీస్ట్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మస్తీ మరియు ప్రసన్న VM డైలాగ్‌లు అందించారు. ఈ సినిమాకి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజు తన బ్యానర్ సందేశ్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు.