కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కు జరిమానా పడింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు రూ.500 ఫైన్ వేశారు. విజయ్ గత మంగళవారం నగర శివారు ప్రాంతమైన పనైయూరులోని విజయ్ మక్కల్ ఇయ్యక్కం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కరై ప్రాంతంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. దీంతో ఆయనకు జరిమానా విధించగా. ఆ మొత్తాన్ని చెల్లించారు.