టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రం నుంచి ‘ఆరాధ్య’ పాటను విడుదలైంది. ఈ పాటలో పెళ్లి తర్వాత జంట మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. తాజాగా విజయ్ మాట్లాడుతూ.. ‘ఖుషి సినిమాలో నాకు ఇష్టమైన పాట ‘ఆరాధ్య’. భార్యభర్తల మధ్య ఉండే బంధాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. నాకు పెళ్లయిన తర్వాత ఈ పాటలో ఉన్నట్లే నా జీవితం ఉండాలని అనుకుంటున్నాను.’ అని చెప్పాడు.