హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ విషయంపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఆనంద్, వైష్ణవి చాలా బాగా నటించారు. కామెడీ, ఎమోషన్, లవ్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.’ అని అన్నారు.