ప్రముఖ టీవీ నటి టీనా దత్తా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె శనివారం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులు ఆసుపత్రిలో భారంగా గడిపానని, తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. ఇటీవల ఆమె 'హమ్ రహీం నా రహీం హమ్' అనే షోలో అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.