శ్రీను వైట్ల దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరియు స్నేహ నటించిన తెలుగు కల్ట్ కామెడీ 'వెంకీ' సినిమాని థియేటర్లలో రి రిలీజ్ చేయనున్నట్లు కొన్ని రోజుల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం రీ-రిలీజ్ గురించి అధికారిక అప్డేట్ ని మూవీ మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 30, 2023న వెంకీ సినిమా వెండితెరపైకి రానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శ్రీ మఠ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనుంది.
రవితేజ, బ్రహ్మానందం, AVS మరియు ఇతరులు నటించిన ట్రైన్ కామెడీ ఎపిసోడ్ తెలుగులో రూపొందించిన అత్యుత్తమ సన్నివేశాలలో ఒకటి. రీ-రిలీజ్ అయ్యిన సినిమాలో టాప్-గ్రాసర్స్ లిస్ట్‌లో చేరడానికి వెంకీకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.