కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, చిత్రం బృందం యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను ముగించింది. గత కొన్ని రోజులుగా కాకినాడ సమీపంలోని రాజానగరం మరియు అద్దరిపేట బీచ్‌లలో గోపీచంద్ తో భీమా యూనిట్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.