నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ 'ప్రాజెక్ట్ కల్కి 2898 AD' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ సంక్రాంతి పండుగ ట్రీట్‌గా ప్రపంచవ్యాప్తంగా 12 జనవరి 2024న విడుదలవుతుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇటీవలే విడుదల తేదీని చిత్ర బృందం విడుదల చేసిన గ్లింప్సె మరియు పోస్టర్ల నుండి తొలగించారు. ఈ కారణంగా ఈ చిత్రం రాబోయే వేసవిలో థియేటర్లలో విడుదల అవుతుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.