నటి మౌని రాయ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. "9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఇంటికి వచ్చాను. నెమ్మదిగా కోలుకుంటున్నాను. నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి విలువైన సమయాన్ని వెచ్చించిన స్నేహితులకు చాలా ధన్యవాదాలు" ఆమె పేర్కొంది. అయితే తన అనారోగ్యానికి ఏంటో వెల్లడించలేదు. ఆమె కేజీఎఫ్: చాప్టర్ 1, బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ చిత్రాల్లో నటించింది.