గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కూడా ఫినిష్ అయింది. అయితే సమంత ఒక ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం సమంత యోగ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడంతో సమంత ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంతకి మళ్ళీ ఏమైంది అంటూ కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.