భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కోలీవుడ్‌లో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో తన తొలి నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'LGM' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 28, 2023న తమిళంలో విడుదలకి సిద్ధంగా ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగస్ట్ 4, 2023న విడుదల కానుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 33 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమచారం. ఈ చిత్రంలో నదియా,యోగి బాబు, మిర్చి విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాకి దర్శకుడు రమేష్ తమిళమణి స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.